బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ దర్యాప్తునకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు తమ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను తెలిపారు.గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ అతనిపై దాడికి పథకం పన్నాడని, ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులకు కలిపి రూ. 50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్టుగా దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

అంతేకాదు అపరేషన్‌ విజయవంతంగా ముగిసిన తర్వాత మరింత డబ్బు ఇస్తామని వాగ్దానం చేశారని, విదేశాలకు పంపిస్తామని కూడా నమ్మబలికారని పోలీసులు తెలిపారు. ఈ ఆఫర్లతో అతడిని నేరానికి ప్రలోభ పెట్టినట్లు దర్యాప్తులో గుర్తించామని వివరించారు.ఆపరేషన్ పూర్తయిందిటైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన అనంతరం నిందితులు తమ హ్యాండ్లర్లకు "ఆపరేషన్ పూర్తయింది" అంటూ సమాచారం అందించినట్లు పోలీసులు తేల్చారు.

అలాగే ఈ దాడికి ముందు నిందితులు ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో టైగర్ ష్రాఫ్ ఆడుతున్న వీడియోను సుపారీ గ్యాంగ్‌కు పంపారు. ఆ తర్వాతే వారు కాల్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది.

గుండు కొట్టించుకున్నాడునిందితుడు హృతిక్ కుమార్ అలియాస్ రోషన్, తనను ఎవరు గుర్తు పట్టకుండా ఉండడానికి పట్టుబడకుండా తప్పించుకోవడానికి, గుండు చేయించు కున్నాడు. అద్దె ఇంటిని పదేపదే మార్చుకోవడం వరకు అనేక ప్రయత్నాలు చేశాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

ఈ దాడికి దాదాపు రెండు నెలల ముందే తన రూపాన్ని మార్చుకోవడం ప్రారంభించాడన్నారు.ఈ ఘటనకు సంబంధించి బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన హ్రితిక్ అలియాస్ రోషన్ (22), హర్యానాకు చెందిన రెహాన్ (18), ఫూల్ సింగ్ (18) అనే ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే టైగర్‌ ష్రాఫ్‌ పై దాడి జరిగిన ఘటనా స్థలం నుంచి ఐదు ఖాళీ తూటాలు, రెండు లైవ్ కార్ట్రిడ్జ్‌లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, బట్టలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నారు.ఇదీ చదవండి: హాట్‌ టాపిక్‌ : ధనుష్‌ పొలిటికల్‌ ఎంట్రీపై టీవీకే స్పందనలారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లింక్స్‌పై ఆరా ఈ కుట్ర వెనుక జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు అనిల్ పండిట్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి తర్వాత సల్మాన్ ఖాన్‌తో సంబంధం ఉన్నవారు ఎవరైనా సరే లక్ష్యంగా చేసుకుంటామనే బెదిరింపులతో అనిల్ పండిట్, హర్మాన్ సంధూ పేర్లతో సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ వైరల్ అయింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే, పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకు వెయిట్‌ చేయాల్సిందే. ఇదీ చదవండి: నర్సు దారుణ హత్య : సీఎం విజయ్‌పై స్టాలిన్‌ మండిపాటు